![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1103 లో.... మను తండ్రి మహేంద్రనే అని దేవయానికి చెప్తాడు శైలేంద్ర. వసుధార వెళ్లిపోతు లెటర్ లో అదే విషయం రాస్తుంది. ఆ లెటర్ దేవయానికి శైలేంద్ర ఇస్తాడు. అది చదివి దేవయాని షాక్ అవుతూ.. అసలు మహేంద్ర ఇలా చేశాడంటే నేను నమ్మ లేకపోతున్నానని దేవయాని అనగానే.. లెటర్ లో వసుధర అంత క్లియర్ గా రాస్తే నువు నమ్మట్లేదు అంటావని శైలేంద్ర అంటాడు. ఏది ఏమైనా ఈ లెటర్ ని అస్త్రం గా ఉపయోగించాలని దేవయాని అంటుంది.
అందుకే కదా మమ్మీ నేనొక పని చేశానంటూ దేవయానికి చెప్తాడు. వసుధార రాసిన లెటర్ పక్కన పెట్టి.. తానే స్వయంగా ఒక లెటర్ వసుధార రాసినట్టు రాస్తాడు. అందులో మనుగారు మీ తండ్రి చనిపోయారు అందుకే అనుపమ గారు చెప్పలేదని రాస్తాడు. ఆ తర్వాత పనిలో పని ఎండీ గురించి కూడా రాస్తాను అనుకుంటూ నా తర్వాత ఎండీ బాధ్యతలు శైలేంద్రకి ఇవ్వండి అని రాసి మళ్ళీ డౌట్ వస్తుందేమోనని రాసి కొట్టేస్తాడు. ఆ లెటర్ మను టేబుల్ పై పెట్టి శైలేంద్ర వెళ్ళిపోతాడు. అప్పుడే మను వచ్చి ఆ లెటర్ చదివి షాక్ అవుతాడు. ఈ లెటర్ నిజంగానే వసుధర గారే రాశారా అని అనుకుంటాడు. అదంతా శైలంద్ర పక్కన నుండి చూస్తాడు. ఈ విషయం అంతా దేవయానికి ఇలా లెటర్ రాసానంటూ చెప్పగానే నాకు తెలియకుండా ఎందుకిలా చేసావ్ అంటూ తిడుతుంది. కచ్చితంగా ఆ మనుకి డౌట్ వస్తుంది. నువ్వే రాసావ్ అనుకుంటాడని.. ఈ లెటర్ ని మాత్రం ఎవరికి కనపడనివ్వొద్దని దేవయాని అంటుంది.
అప్పుడే ధరణి వచ్చి.. ఏ లెటర్ అంటూ అడుగుతుంది. దాంతో శైలేంద్ర, దేవాయని ఇద్దరు టెన్షన్ పడతారు. ఎదో ఒకటి కవర్ చేస్తారు. మరొకవైపు వసుధార స్పృహ లోకి ఇంకా రాదు. తన పక్కనే రంగ కూర్చొని తననే చూస్తుంటాడు. అప్పుడే సరోజ మరియు రంగా ఫ్రెండ్ వస్తారు. ఏంటి అలా దగ్గర ఉండి చూసుకుంటున్నావని సరోజ అడుగుతుంది. మేడం మంచి వారిలా ఉన్నారని రంగా చెప్తాడు. ఆ తర్వాత వసుధారకి డ్రెస్ రంగాకి ఇచ్చి వెళ్తుంది సరోజ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |